KNRL: పట్టణంలోని నారాయణ పాఠశాలలో ఏజిఎం రమేష్ కుమార్ ఆధ్వర్యంలో సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రిన్సిపల్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులలో సృజనాత్మక శక్తిని పెంచే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ ఛైర్మన్ రఘు విద్యార్థులు తయారు చేసిన నమూనాలను చూసి వారిని అభినందించారు.