కృష్ణా: హోంమంత్రి అనితపై ఎర్రగుండ్లపాలెం తాడిపత్రి చంద్రశేఖర్ విమర్శలు చేశారు. శుక్రవారం విజయవాడలో వంశీతో ములాఖాత్ అయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యేలను మీరు మాట్లాడిన బూతులు ప్రజలు గమనిస్తున్నారని, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు బూతులు మీకు వినబడలేదా అంటూ ప్రశ్నించారు. జైల్లో ఉన్న వైసీపీ నేతలకు జగన్ అండగా ఉన్నారని తెలిపారు.