ప్రకాశం: కనిగిరి పట్టణంలోని శంఖవరంలో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని జిల్లా మలేరియా అధికారి మధుసూదన్ రావు తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. దోమ కాటు వల్ల వచ్చే వ్యాధులపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. అలాగే, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నిరంతరం భాగస్వాములై ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చూడాలన్నారు.