సంతబొమ్మాళి మండలం చెట్ల తాండ్ర గ్రామానికి చెందిన డొక్కరి రాజేష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షలు రివార్డ్ ప్రకటించింది. గత ఏడాది జులై 15న జమ్మూ కాశ్మీర్, దొడా జిల్లాలో సంవత్సరంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో డొక్కరి రాజేష్ గాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు రాజేష్ కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది.