అల్లూరి: చింతపల్లి మండలం కిటుముల పంచాయితీ పరిధి పొలంబందలో ఇంటింటి కుళాయిలు గత రెండు నెలలుగా మరమ్మతులకు గురికావడంతో తాగునీటికై అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కలుషితమైన ఊటగడ్డ నీటిని సేవించి రోగాల పాలవుతున్నామని వాపోతున్నారు. అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.