VZM: తెర్లాం మండలంలోని పెరుమాళి ఆదర్శ పాఠశాలను మండల విద్యాధికారి త్రినాధరావు శుక్రవారం సందర్శించారు. పాఠశాలలో జరుగునున్న ఇంటర్ పరీక్షల ఏర్పాటును పరిశీలించారు. పరీక్ష జరిగే తరగతి గదుల్లో ఫర్నిచర్, ఫ్యాన్, లైటింగ్స్, త్రాగునీరు మరుగుదొడ్లు పనితీరు తదితర వాటిని పరిశీలించారు. మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు సజావుగా నిర్వహించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు.