NGKL: ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో శుక్రవారం భేటీ అయ్యారు. ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు. నూతన జూనియర్ కళాశాల భవనం నిర్మాణం, జేఎన్టీయూ క్యాంపస్ ఏర్పాటు, కొత్త ఆర్ అండ్ బి రోడ్లు మంజూరు, తదితర అంశాలను సీఎం దృష్టికి తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.