గుంటూరు: మంగళగిరిలోని ఎయిమ్స్ హాస్పిటల్‌ను శుక్రవారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. హాస్పిటల్లో పలు వార్డులను పరిశీలిస్తూ పేషెంట్ల బాగోవులను అడిగి తెలుసుకున్నారు. హాస్పటల్లోనే వసతుల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్పిటల్ అభివృద్ధిపై హాస్పిటల్ వైద్యులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.