AP: స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా వ్యవసాయ రంగంలో 15 శాతం వృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గ్రోత్ ఇంజిన్లుగా 11 పంటలకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఎరువుల నిర్వహణకు రూ.40 కోట్లు, ప్రకృతి వ్యవసాయాన్ని పోత్సహించడానికి రూ.61 కోట్లు, వ్యవసాయ యంత్రాల రాయితీకి రూ.139.65 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.