NLR: ఆటోనగర్లో అగ్ని ప్రమాద ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వేదాయపాలెం సీఐ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యజమానులు తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తామని తెలిపారు.