TPT: రామచంద్రపురం మండలంలోని శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన నామాల కాలువలో లభించిన పురాతన విగ్రహాన్ని ఈనెల 24వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:45 మధ్య నామాల కాలవ దగ్గర పునఃప్రతిష్ఠ చేస్తున్నట్లు నడవలూరు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి స్వామి తెలిపారు. భక్తులందరూ ఈ విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొని స్వామి శ్రీవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.