కడప: పోరుమామిళ్లకు చెందిన వారికి శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బేస్తవారిపేట మండలం కలగట్లలో శనివారం కర్నూలు – ఒంగోలు హైవేపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బేస్తవారిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.