»Ap Fire Breaks Out During Sri Ram Navami Celebration In Duvva Village
Fire Accident శ్రీరామనవమి వేళ అపశ్రుతి.. ఆలయంలో చెలరేగిన మంటలు
అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియడం లేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు (Sri Ram Navami) అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణలోని భద్రాచలంలో (Bhadrachalam) కన్నుల పండుగ సీతారాములోరి కల్యాణం నేత్రపర్వంగా సాగింది. తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) భారీ ఏర్పాట్లు చేసింది. దేశమంతా సంబరంగా చేసుకుంటుడగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మాత్రం అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలో అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. దీంతో ఉత్సవాలకు హాజరైన భక్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) తణుకు (Tanuku) మండలం దువ్వ గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో (Venugopala Swamy Temple) శ్రీరామనవమి ఉత్సవాలకు ఏర్పాట్లు భారీ స్థాయిలో చేశారు. వేసవి కావడంతో భక్తులకు నీడ కోసం చలువ పందిళ్లు వేశారు. గురువారం ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్సవాలు జరుగుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తాటి ఆకులతో పందిళ్లు ఏర్పాటు చేయడంతో వెంటనే మంటలు వాటికి వ్యాపించాయి. కొన్ని నిమిషాల్లో ఆలయాల్లో మంటలు తీవ్రమయ్యాయి.
పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో భక్తులు బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియడం లేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.