హీరో విక్రమ్ (Vikram), కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత, ఐశ్వర్య లక్ష్మి ఇలా భారీ తారగణంతో తెరకెక్కుతోన్న చిత్రం పొన్నియన్ సెల్వన్2(Ponniyin Selvan2). మణిరత్నం(ManiRatnam) దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్1 సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పొన్నియన్ సెల్వన్1(Ponniyin Selvan1) సినిమా గత ఏడాది విడుదలై కాసుల వర్షం కురిపించింది.

తమిళ్ లో మొదటి పార్టు గ్రాండ్ సక్సెస్ ను సాధించింది. మిగిలిన చోట్ల మాత్రం అంతంతమాత్రం ఆడినా మంచి వసూళ్లను సాధించింది. పొన్నియన్ సెల్వన్1(Ponniyin Selvan1) సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడంతో మొత్తంగా రూ.400 కోట్ల కలెక్షన్స్ ను సాధించింది.
తాజాగా పొన్నియన్ సెల్వన్2(Ponniyin Selvan2) సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్ తో పాటు ట్రైలర్ ను విడుదల‘(Trailer Release) చేశారు. ఈ మూవీ ట్రైలర్ లో యుద్ధాలు, ఒకరిపై మరొకరు పన్నే పన్నాగాలు, మొదటి పార్టులో చనిపోయాడనుకున్న పొన్నియన్ సెల్వన్ బతికి ఎలా బయటకు వచ్చారు వంటి సీన్స్ ను చూపించారు. ట్రైలర్ మొత్తం యుద్ధ సన్నివేశాలే కనిపిస్తాయి. పొన్నియన్ సెల్వన్1(Ponniyin Selvan1)కి ఇది కొనసాగింపు కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.