PLD: మహా శివరాత్రి సందర్భంగా భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కోసం కోటప్ప కొండపై ప్రసాదం కౌంటర్ల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు కోటప్పకొండ ఈవోను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని అంబేడ్కర్ సమావేశ మందిరంలో కోటప్పకొండ తిరునాళ్ల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.