NTR: విజయవాడ శివారు ఎనికేపాడులో భారీ దొంగతనం జరిగింది. పటమట పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఎనికేపాడులోని ఐఫోన్ గోడౌన్ రేకు పగలకొట్టి గుర్తుతెలియని దుండగులు రూ. 2.50కోట్ల విలువైన 372 ఐఫోన్లు చోరీ చేసినట్లు గుర్తించారు. మేనేజర్ ఫరూక్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు.