కోనసీమ: రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో MLC ఎన్నికల నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ పోలుపర్తి వెంకట గణేష్ కుమార్ పాల్గొన్నారు. గణేష్ కుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఆదేశాల మేరకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల MLC ఎన్నికల అభ్యర్థిని గెలుపుంచు కోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు.