కృష్ణా: విజయవాడలోని పాస్ పోర్ట్ దరఖాస్తుదారులకు శుభవార్త. విజయవాడ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయంలో రోజుకు అదనంగా 50 స్లాట్లు కేటాయించనున్నట్లు అధికారులు శనివారం ప్రకటించారు. ఫిబ్రవరిలో ప్రతి బుధవారం 250 అదనపు స్లాట్లను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు తాజా అపాయింట్మెంట్లు, రీషెడ్యూల్ కోసం passportindia.gov.in వెబ్సైట్ సందర్శించాలి.