తన సతీమణి శోభితా ధూళిపాళ్ల గురించి అక్కినేని నాగచైతన్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ముఖ్య విషయాల్లో నేను గందరగోళానికి గురైనప్పుడు శోభిత ఎంతో సపోర్ట్‌గా ఉంటుంది. అన్ని విషయాల్లో సరైన సూచనలు, సలహాలు ఇస్తుంటుంది. తన నిర్ణయాన్ని నేను ఎంతో గౌరవిస్తా. ప్రతీది ఆమె నిర్ణయం తర్వాతే కార్యరూపం దాలుస్తుంది’ అని పేర్కొన్నారు.