VZM: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని గీత కార్మిక కులాలకు కేటాయించిన మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా బొబ్బిలి పట్టణంలో గీత కులస్తులకు రెండు వైన్ షాపులు కేటాయిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎక్సైజ్ సీఐ పి. చిన్నంనాయుడు తెలిపారు.