NDL: బనగానపల్లె పట్టణంలో శ్రీకృష్ణదేవరాయుల 555వ జయంతి వేడుకలను సోమవారం వైభవంగా నిర్వహించారు. బలిజ సంఘం ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి నుంచి శ్రీకృష్ణదేవరాయుల విగ్రహం వరకు ర్యాలీ చేశారు. బలిజ సంఘం సభ్యులు శ్రీకృష్ణదేవరాయుల విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం బలిజ సంఘం సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, బ్రెడ్లను పంపిణీ చేశారు.