Karnataka అసెంబ్లీకి మోగిన నగారా.. మే 10న పోలింగ్.. 13వ తేదీన కౌంటింగ్
Karnataka assembly elections:కర్ణాటక అసెంబ్లీకి (Karnataka assembly) కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 12వ తేదీన నోటిపికేషన్ (notification) ఇస్తామని ప్రకటించింది. 2మే 10వ తేదీన పోలింగ్ జరగనుండగా.. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.
Karnataka assembly elections:కర్ణాటక అసెంబ్లీకి (Karnataka assembly) కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 12వ తేదీన నోటిపికేషన్ (notification) ఇస్తామని ప్రకటించింది. 20వ తేదీన నామినేషన్ల దాఖలు చేసేందుకు చివరి తేదీ అని తెలిపింది. 21వ తేదీన నామినేషన్లను పరిశీలించి.. 24వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించేందుకు గడువు ఇచ్చారు. మే 10వ తేదీన పోలింగ్ జరగనుండగా.. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు.
కర్ణాటకలో మొత్తం 58282 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాజీవ్ కుమార్ తెలిపారు. తొలిసారి ఓటు హక్కును 9.17 లక్షల మంది కలిగి ఉన్నారు. 41312 ట్రాన్స్ జెండర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికల్లో 80 ఏళ్లు పైబడిన వారికి ఓట్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించారు. దివ్యాంగులకు కూడా ఓట్ ఫ్రమ్ హోం ఆప్షన్ ఇచ్చారు. మహిళల కోసం ప్రత్యేకంగా 1300పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కర్ణాటకలో 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో 36 ఎస్సీ, 15 ఎస్టీ స్థానాలు ఉన్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka assembly elections) ప్రచారంలో బీజేపీ (bjp), కాంగ్రెస్ (congress) అగ్రనేతలు బిజీగా ఉన్నారు. ప్రధాని మోడీ (modi), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ 124 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మాజీ సీఎం సిద్దరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (dk shivakumar) కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ఆప్ కూడా 80 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న 224 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఇదివరకే ఆ పార్టీ ప్రకటన చేసింది. ఈ ఏడాది మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరికొన్నిగంటల్లో తేదీలను ఈసీ ప్రకటించనుంది.