NRML: అర్హులైన ప్రతీ ఒక్కరూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్ అన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న వార్డు సభల్లో భాగంగా బుధవారం పట్టణంలో ఆస్రా కాలనీలో నిర్వహించిన వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పాల్గొని రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు వివిధ రకాల దరఖాస్తుదారుల దరఖాస్తులను పరిశీలించారు.