MBNR: మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. బుధవారం కొయిలకొండ మండలం గర్లపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళ సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను, సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించారు.