ASR: జి.మాడుగుల మండలంలోని గెమ్మెలిలో ఆశా కార్యకర్త సరస్వతి బుధవారం కుష్టువ్యాధి గుర్తింపుపై ఇంటింటా సర్వే నిర్వహించారు. శరీరంపై పాలిపోయిన ఎరుపు రాగి వర్ణం గల మచ్చల్ని క్షుణ్ణంగా పరీక్షించారు. మైక్రో బ్యాక్టీరియా లెఫ్రే అనే క్రిమి వల్ల కుష్టువ్యాధి వస్తుందని తెలిపారు. బహుళ ఔషధ చికిత్సతో పూర్తిగా నివారణ పొంది సామాజిక జీవనం గడపవచ్చని అవగాహన కల్పించారు.