NRPT: నారాయణపేట నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 100 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను MLA చిట్టెం పర్ణిక రెడ్డి బుధవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్య మంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.