KNR: రామడుగు మండలంలోని పలు గ్రామాల్లో అక్రమంగా మట్టి రవాణా కొనసాగుతుంది. యదేచ్చగా మట్టి రవాణాతో అర్ధరాత్రి వేళ, లారీలు, టిప్పర్ల శబ్దంతో ప్రశాంతత కోల్పోతున్నామని ప్రజలు వాపోతున్నారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.