MP Avinash : ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఎంపీ అవినాష్
వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy)కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని అవినాష్ కోరారు. సీబీఐ (CBI) దాఖలు చేసిన కౌంటర్ ను బట్టి చూస్తే.. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి విషయంలో సీబీఐ చాలా దూకుడుగా విచారణ జరిపిందని.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవచ్చని కూడా చెబుతున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy)కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని అవినాష్ కోరారు. సీబీఐ (CBI) దాఖలు చేసిన కౌంటర్ ను బట్టి చూస్తే.. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి విషయంలో సీబీఐ చాలా దూకుడుగా విచారణ జరిపిందని.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవచ్చని కూడా చెబుతున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు (Supreme Court) కేసు విచారణాధికారిని మార్చాలని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న రాంసింగ్‌నూ కొనసాగించాలని మరో అధికారిని నియమించాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ ఏప్రిల్ 10వ తేదీన జరగనుంది. ఈ లోపు అరెస్ట్ చేస్తారేమోనన్న ఉద్దేశంతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది.
వై.ఎస్. వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) సీబీఐ దాఖలు చేసిన కౌంటర్లో అవినాష్ రెడ్డిపై ప్రధానంగా అనుమానాలు వ్యక్తం చేసింది. వైఎస్ అవినాష్‌రెడ్డి, శివశంకర్ రెడ్డితో(Sivashankar Reddy) వివేకాకు రాజకీయ వైరుధ్యం పెరిగిందని సీబీఐ తెలిపింది. ఎంపీ టికెట్ అవినాష్‌రెడ్డికి బదులు తనకు ఇవ్వాలని వివేకా కోరుకున్నారనిపేర్కొంది. తనకు ఇవ్వకపోయినా షర్మిల,(Sharmila) విజయమ్మకు ఇవ్వాలని వివేకా పట్టుబట్టారని తెలిసింది. వివేకా రాజకీయ కదిలికలు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డికి నచ్చలేదని సీబీఐలో తెలిపింది. శివశంకర్‌రెడ్డితో కలిసి అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి వివేకా హత్యకు కుట్ర పన్నినట్లు తెలుస్తోందని పేర్కొంది. హత్య జరిగిన రోజు రాత్రి వై.ఎస్. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఇంటికి సునీల్ యాదవ్ (Sunil Yadav)వెళ్లాడని ఐదుగురితో కలిసి అవినాష్‌రెడ్డి హత్య స్థలానికి వెళ్లాడని తెలిపింది. నిందితులు హత్య జరిగిన స్థలాన్ని శుభ్రం చేశారని వివేకా శరీరంపై ఉన్న గాయాలు కనిపించకుండా బ్యాండేజీ కట్టారని కోర్టుకు సమర్పించిన కౌంటర్లో సీబీఐ పేర్కొంది. సిబిఐ అధికారులు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే పలుమార్లు అవినాష్ రెడ్డిని విచారించారు. త్వరలోనే అవినాశ్ ను సీబీఐ అధికారులు మరోసారి విచారణకు పిలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్(Anticipatory bail) కోసం పిటిషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.