»Revanth Reddy Target To Ktr Over Tspsc Paper Leake Case
Revanth Reddy On KTR : టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకు: కేటీఆర్ ని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..!
Revanth Reddy On KTR : టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకు వ్యవహారంలో మంత్రి కేటీఆర్ ని.. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. ప్రశ్నాపత్రాల కుంభకోణంలో కేటీఆర్ నే బాధ్యులుగా చేస్తూ నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.. నేరంలో భాగస్వాముల పంపకాల్లో వచ్చిన భేదాల వల్లే ఈ ప్రశ్న పత్రాల కుంభకోణం బయటికి వచ్చిందని ఆరోపించారు.
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకు వ్యవహారంలో మంత్రి కేటీఆర్ ని.. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. ప్రశ్నాపత్రాల కుంభకోణంలో కేటీఆర్ నే బాధ్యులుగా చేస్తూ నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.. నేరంలో భాగస్వాముల పంపకాల్లో వచ్చిన భేదాల వల్లే ఈ ప్రశ్న పత్రాల కుంభకోణం బయటికి వచ్చిందని ఆరోపించారు. ప్రశ్నాపత్రాల కుంభకోణంలో పాత్రధారులు, సూత్రధారులను కాపాడేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. అన్ని కుంభకోణాల్లో సిట్ వేయడం ద్వారా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను అన్ని నియమ నిబంధలను ఉల్లంఘించి నియామకం చేయడం జరిగింది. నిందితులను కస్టడీలోకి తీసుకోకుండా, విచారణ చేయకుండా మంత్రి కేటీఆర్ ఏ రకంగా వారిద్దరినీ బాధ్యులుగా చేసి మాట్లాడతారు..సిట్ చేసే విచారణ అంతా కేటీఆర్ కనుసన్నుల్లోనే జరుగుతోంది. ఈ కుంభకోణంలో బాధ్యులుగా ఉన్న వారిని రక్షించేందుకే కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ విమర్శించారు. కోర్టుకు అందించాల్సిన సిట్ సమాచారం అంతా కూడా కేటీఆర్ కు ఎలా చేరుతుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ కుంభకోణంలో హవాలా, కుట్రకోణం ఇమిడి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. సిబిఐ, ఈడిలను నియంత్రించి సిట్ ద్వారానే విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈడీ, సిబిఐ, ఏసీబీ అధికారులతో కూడిన ప్రత్సేక దర్యాప్తు బృందాన్ని ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు విచారణకు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ప్రశ్నా పత్రాల లీకేజీ విషయంలో ప్రశ్నించినందుకు తమకు నోటీసులు ఇస్తున్నారని…దోపిడీ దొంగతనం చేసిన కేటీఆర్ కు సమాచారం ఇస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇందులో కోట్ల రూపాయల కుంభకోణం, మనీలాండరింగ్ జరిగిందని రేవంత్ ఆరోపించారు. హవాలాతోపాటు, విదేశాల్లో లావాదేవీలు జరిగాయని కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో పాలకులు, ప్రభుత్వాధికారుల పాత్ర ఉందని రేవంత్ ఆరోపించారు. ఈ కేసులోఅవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ చట్టాలు వర్తిస్తాయని రేవంత్ తెలిపారు.
అవినీతి నిరోధక చట్టంలో ఒక్క సెక్షన్ కింద కూడా సిట్ అధికారి కేసు పెట్టలేదని రేవంత్ ఫైర్ అయ్యారు. తద్వారా ముఖ్యమైన వ్యక్తులను కాపాడేందుకు సిట్ అధికారి ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. అందుకే సిబిఐ, ఈడి, ఐటీ శాఖలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాల్సిందేనని రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నారు.