ASR: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని సీపీఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. డుంబ్రిగూడ మండల కేంద్రంలోని మూడు రోడ్ల కూడలి వద్ద పలు నినాదాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి పోతురాజు మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డా’ బి.ఆర్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి తక్షణమే దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.