VZM: భోగాపురం ఆదర్శ పాఠశాలలో సైన్స్ ఫెయిర్‌ను ఎమ్మెల్యే లోకం నాగమాధవి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రాజెక్టులను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. మంచి ప్రాజెక్టులు తయారు చేసిన విద్యార్థులను అభినందించారు. సైన్స్ పై విద్యార్థులు పట్టు సాధించాలని ఆమె సూచించారు.