SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ సభ్యుడు పసుల బాలరాజ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనుషులందరూ సమానమే, ప్రతి ఒక్కరూ కుల, మత భేదం లేకుండా కలిసిమెలిసి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, అధికారులు పాల్గొన్నారు.