ADB: తాంసి మండలంలోని గిరిగావ్ గ్రామానికి చెందిన తులసి రామ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఎంపీ నగేశ్ బాధిత కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఎంపీ వెంట మాజీ జడ్పీటీసీ రాజు, నారాయణ, చంద్రకాంత్, తదితరులు ఉన్నారు.