పెరుగు.. ఆరోగ్యానికే కాదు, జుట్టు సమస్యలు తొలగించటానికీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కప్పు పెరుగులో చెంచా చొప్పున నిమ్మరసం, తేనె కలిపి తలకి రాసుకుని ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. పెరుగులో కాస్త ఆలివ్ ఆయిల్ కలిపి తలకి మసాజ్ చేసుకోవాలి. వారానికి 2సార్లు ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. వెంట్రుకలకు పోషణ అంది, మృదువుగా మారతాయి. జుట్టు మెరుస్తుంది.