»Why Rahul 2 Bjp Mlas From Karnataka Not Disqualified
Why Rahul..కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేటు వేయలే
Why Rahul:కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీపై (Rahul gandhi) అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. విదేశాల్లో కూడా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అయితే కర్ణాటకలో ఇద్దరు బీజేపీ నేతలకు జైలు శిక్ష పడింది.. అయినప్పటికీ వారిపై అనర్హత వేటు వేయలేదు. వారికి శిక్ష విధించి 2 నెలలు అవుతున్నా.. అనర్హత వేటు వేయలేదు.
Why Rahul..2 bjp mlas from karnataka not disqualified
Why Rahul:కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీపై (Rahul gandhi) అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. విదేశాల్లో కూడా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అయితే కర్ణాటకలో ఇద్దరు బీజేపీ నేతలకు జైలు శిక్ష పడింది.. అయినప్పటికీ వారిపై అనర్హత వేటు వేయలేదు. వారికి శిక్ష విధించి 2 నెలలు అవుతున్నా.. అనర్హత వేటు వేయలేదు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ నేతలు (congress) ప్రశ్నిస్తున్నారు.
కాంట్రాక్ట్ పనుల్లో రూ.50 లక్షల (50 lakhs bribe) అవినీతి నేరం రుజువు అయ్యింది. దీంతో హావేరి బీజేపీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్కు (nehru) రెండేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. మూడిగెరె బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామికి (kumaraswamy) చెక్ బౌన్స్ కేసులో ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పటికీ ఆయనపై కూడా అనర్హత వేటు పడలేదు. వీరిద్దరూ బెయిల్ మీద ఉన్నారు. ఈ మే నెలలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు. రాహుల్ గాంధీ మీద మాత్రం వెంటనే పార్లమెంట్ చర్యలు తీసుకుంది. ఇటు కోర్టు తీర్పు రాగానే అటు అనర్హత వేటు పడింది.
కోలార్ ఎన్నికల సభలో మోడీ (modi) ఇంటి పేరు ఉన్న వారంతా దొంగలేనని రాహుల్ గాంధీ (Rahul gandhi) కామెంట్ చేశారు. ఈ కేసు సూరత్ కోర్టులో విచారణ జరిగి.. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. పై కోర్టులో సవాల్ చేసుకునేందుకు 30 రోజుల సమయం ఇవ్వడంతోపాటు.. శిక్షను నిలుపుదల చేసింది. ప్రజా ప్రతినిధ్య చట్టం ప్రకారం.. రెండు లేదా అంతకన్నా ఎక్కువ జైలుశిక్ష పడితే పదవీలో కొనసాగేందుకు అవకాశం లేదు. దీంతో లోక్ సభ సెక్రటరీ జనరల్ రాహుల్ గాంధీపై (Rahul gandhi) అనర్హత వేటు వేశారు. ఆ తర్వాత బంగ్లా ఖాళీ చేయాలని కూడా నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ సహా విపక్షాలు.. రాహుల్ (Rahul gandhi) అనర్హత వేటు గురించి పోరాటం చేస్తున్నాయి. తనకు తాను రాహుల్ గాంధీ.. డిస్ క్వాలీఫై అని ట్విట్టర్ బయో మార్చుకున్నారు.
అనర్హత వేటుకు సంబంధించి రాహుల్ గాంధీ పై కోర్టును ఆశ్రయిస్తే సానుకూల ఫలితం వస్తే అనర్హత వేటుకు గురయ్యే అవకాశం లేదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951 సెక్షన్ 8 ప్రకారం.. ఆర్టికల్ 102 (1) ఈ నిబంధన మేరకు లోక్ సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసింది.