KDP: కొండాపురం మండలం వెంకటాపురం గ్రామం వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ముద్దనూరు నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న కారు తాడిపత్రి నుంచి కొండాపురం వైపు వస్తున్న బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్కూటర్లో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులకు కాళ్లు విరిగినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.