తెలంగాణ సీఎం కేసీఆర్(CM Kcr)కు బండి సంజయ్(bandi sanjay) లేఖ రాశారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లతోపాటు ఇతర ఉద్యోగుల(employees) సమస్యలు పరిష్కరించాలని లేఖలో స్పష్టం చేశారు. 23 వేల మంది ఉద్యోగులు ఉంటే వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వెల్లడించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay) లేఖ రాశారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లు సహా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. సుమారు 23 వేల మందికిపైగా ఉద్యోగులు ఉండగా..వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కూడా ప్రభుత్వం వ్యతిరేక వైఖరిని కనబరుస్తుందని విమర్శించారు.
జీపీఎఫ్, పీఆర్సీ వంటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బండి సంజయ్(bandi sanjay) మండి పడ్డారు. 1999 నుంచి 2004 మధ్య సమయంలో విద్యుత్ సంస్థల్లో ఎంపికైనా వారికి జీపీఎఫ్ అవకాశం కల్పించాలని కోరారు. దీంతోపాటు ఆర్టిజన్ల సమస్యలు కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలు కూడా పెండింగ్ లోనే ఉన్నాయని సంజయ్ గుర్తు చేశారు. దీంతోపాటు కొత్త పీఆర్సీ గురించి ప్రభుత్వం అసలు స్పందించడం లేదని పేర్కొన్నారు. అయితే వారి సమస్యలు పరిష్కరించకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉద్యోగులు ఎదిరించి తిరగబడే రోజులు వస్తాయని స్పష్టం చేశారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామ పంచాయతీల్లో ఉద్యోగులకు జీతాలు(salaries) రావడం లేదని ఉద్యోగులు(employees) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు మూడు నెలల నుంచి తమకు ఇవ్వాల్సిన వేతనాలు రిలీజ్ చేయడం లేదని వాపోతున్నారు. ఈ అంశంపై అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని మండి పడుతున్నారు. జీతాలు సమయానికి రాకపోవడంతో అప్పులు చేసి కుటుంబ జీవనం గడుపుకోవాల్సి వస్తుందని ఉద్యోగులు అంటున్నారు. ఇంకోవైపు అనేక ప్రాంతాల్లో పంచాయతీ సెక్రటరీ సిబ్బందికి సైతం శాలరీలు రావడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ప్రతిపక్ష నేతలు సైతం ఆరోపిస్తున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ తెలంగాణను పట్టించుకోకుండా దేశ రాజకీయాల్లోకి వెళ్లడం పట్ల పలువురు రాజకీయ నేతలు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.