SRD: మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, వారు పోలీసులకు పట్టుబడితే తల్లిదండ్రులదే బాధ్యత అని సిర్గాపూర్ ఎస్ఐ వెంకటరెడ్డి అన్నారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాట్లాడుతూ.. బైక్లు, ఇతర వాహనాలు ఇస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. పిల్లలు వాహనాలు నడపడంతో ప్రాణాలు కోల్పోతున్నారని, అలాగే ఇతర ప్రయాణికులకూ తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.