KNR: చొప్పదండి మండలం రాగంపేట ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో, 7వ తరగతి చదువుతున్న ఉడుత రిత్విక అనే విద్యార్థిని, సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఈ నెల 29 వరకు సరూర్ నగర్లో జరిగే ఆట్య పాట్య ఛాంపియన్ షిప్లో ఆమె పాల్గొంటున్నారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాజ్ కుమార్ తెలిపారు.