కాకినాడ: పోర్టు నుంచి 1,064 టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై సివిల్ సప్లయిస్ డీటీ శ్రీనివాసరావు ఫిర్యాదుపై పోర్టు సీఐ సునీల్ కుమార్ కేసు నమోదు చేశారు. ఈ నెల 20న స్వాధీనం చేసుకున్న బియ్యానికి సంబంధించి లవన్ ఇంటర్నేషనల్ సంస్థపై కేసు నమోదు చేశారు. సంస్థ ఉద్యోగులు అమిత్ కుమార్ జైన్, రవికుమార్‌పై పలు సెక్షన్లతో కేసు నమోదైంది.