కృష్ణా: విస్సన్నపేట మండలంలోని చండ్రు పట్ల తండాలో గురువారం సారా స్థావరంపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. సారా కాస్తున్న మహిళ బాణావతు పింప్లిని అరెస్ట్ చేసి ఆమె వద్దనున్న 1 లీటర్ల సారా, 40 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మహిళను తిరువూరు కోర్ట్ ఎదుట హాజరు పరచినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.