»Bihar Deputy Cm Tejashwi Yadav Becomes Father He Welcomes First Child
Tejashwi Yadav తండ్రి హోదా పొందిన ఉప ముఖ్యమంత్రి
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని తేజస్వి స్వాగతించాడు. పలుమార్లు కేసీఆర్, కేటీఆర్ తో సమావేశమయ్యాడు. హైదరాబాద్ లో ప్రగతి భవన్ ను కూడా సందర్శించాడు. నరేంద్ర మోదీ అరాచక పాలనను తేజస్వి యాదవ్ నిరసిస్తున్నాడు. ఇదే క్రమంలో తేజస్వి కుటుంబంపై దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.
బిహార్ (Bihar) యువ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. రాజకీయంగా కొత్త అడుగులు వేస్తూ కొత్త పదవులు పొందుతున్న తేజస్వి వ్యక్తిగత జీవితంలో కొత్త పదవి అందుకున్నాడు. తండ్రి (Father) హోదాను అందుకున్నాడు. అతడి భార్య పాప (Baby Girl)కు జన్మనివ్వడంతో తేజస్వి ఉబ్బితబ్బిబవుతున్నాడు. ఈ సందర్భంగా దేవుడు ఇచ్చిన బహుమతి అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా (Socia Media) ద్వారా తేజస్వి పంచుకున్నాడు.
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుమారుడు తేజస్వి యాదవ్. తండ్రి రాజకీయ వారసత్వాన్ని (Political Career) తేజస్వి పుణికి పుచ్చుకున్నాడు. అతడు 9 డిసెంబర్ 2021న తన స్నేహితురాలు రేచల్ గోడినో (Rachel Godinho) వివాహమాడాడు. అనంతరం ఆమె పేరు రాజేశ్వరి యాదవ్ గా మారింది. ఆమె సోమవారం ఆస్పత్రిలో పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తేజస్వి ట్విటర్ (Twitter)లో తెలిపాడు. ‘దేవుడు ఆనందంతో తనకు పాప రూపంలో బహుమతి పంపాడు’ అంటూ తేజస్వి ట్వీట్ చేస్తూ కుమార్తెను ఎత్తుకున్న ఫొటోను పంచుకున్నాడు. ఇక అతడి సోదరి రోహిణి ఆచార్య (Rohini Acharya) ఇదే విషయాన్ని చెబుతూ ‘ఇక మా ఇల్లు కేరింతలతో సందడితో నిండనుంది’ అంటూ ఆనందం పంచుకుంది.
కాగా తేజస్వి ప్రస్తుతం రాష్ట్రీయ జనతా దల్ (Rashtriya Janata Dal -RJD) అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. నితీశ్ కుమార్ (Nitish Kumar)తో అనూహ్యంగా జత కట్టి ప్రభుత్వాన్ని నెలకొల్పాడు. ప్రస్తుతం బిహార్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. రానున్న లోక్ సభ ఎన్నికల సమయంలో నితీశ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లితే బిహార్ ముఖ్యమంత్రి (Chief Minister)గా తేజస్వి ఎన్నికయ్యే అవకాశం ఉంది. కాగా తేజస్వి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (K Chandrashekar Rao), మంత్రి కేటీఆర్ (KT Rama Rao)తో సన్నిహితంగా ఉంటున్నాడు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని తేజస్వి స్వాగతించాడు. పలుమార్లు కేసీఆర్, కేటీఆర్ తో సమావేశమయ్యాడు. హైదరాబాద్ లో ప్రగతి భవన్ ను కూడా సందర్శించాడు. నరేంద్ర మోదీ అరాచక పాలనను తేజస్వి యాదవ్ నిరసిస్తున్నాడు. ఇదే క్రమంలో తేజస్వి కుటుంబంపై దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.
बनकर नन्हीं सी परी मेरे घर मेहमान आई है खुशियों की संग सौगात लाई है दादा-दादी बनने की खुशी में मम्मी-पापा के चेहरे पे जो मुस्कान लाई है.. pic.twitter.com/3qlhQhaQ5c