ADB: పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రిని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు వార్డులను నాయకులతో కలిసి పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌ను కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అధికారులు తదితరులున్నారు.