కామారెడ్డి: సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 17వ రోజుకు చేరింది. గురువారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సీఎం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ ఆధ్వర్యంలో చేశారు.