MDK: బతుకమ్మ పేరుతో సిద్దిపేట బీఆర్ఎస్ నాయకులు కోట్ల రూపాయలు దోచుకున్నారని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. చెరువులను మరమ్మత్తు చేయకుండా బిల్లులు తినేశారని మండిపడ్డారు. చెరువు మొత్తం గుర్రపు డెక్క నిండడంతో పతంగి కోసం వెళ్లి బాలుడు మృతి చెందడం బాధాకరం అన్నారు.