Weekly Horoscope:ఈ వారం రాశి ఫలాలు (మార్చి 26 నుంచి ఏప్రిల్ 1 వరకు)
Weekly Horoscope:ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రోజున మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్లో ఉన్న వార ఫలాలు చూడగలరు.
Weekly Horoscope:ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రోజున మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్లో ఉన్న వార ఫలాలు చూడగలరు.
మేష రాశి:- శుభకార్యములను ఆచరిస్తారు. పట్టుదలతో వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. క్రీడాకారులకు ఆటంకాలు కలిగినప్పటీ.. విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులు రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తారు. పెద్దల అండదండలు ఉంటాయి. ధనప్రాప్తి కలుగుతుంది. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభములను కలుగచేస్తుంది.
వృషభ రాశి:- దూరప్రాంతాల నుంచి శుభవార్త వింటారు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అపవాదులు తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యనిర్వహణ సామర్థ్యం ప్రదర్శిస్తారు. పండితులు కవులు నూతన గ్రంథ రచనలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది. నిద్ర తక్కువ ఉంటుంది. ఆంజనేయస్వామి ఆరాధన శుభమును కలిగిస్తుంది.
మిథున రాశి:- పెద్దలతో విరోధములు ఏర్పడకుండా చూసుకోవాలి. అపకీర్తి కలుగుతుంది. బహుముఖ ధన వ్యయము కలుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం అంత మంచిది కాదు. స్థిరాస్థి మూలంగా అశాంతి కలుగవచ్చు. సన్నిహితులు దూరమయ్యే ప్రమాదం కలిగే అవకాశం. కళాకారులు వివాదాలలో చిక్కుకుంటారు. శివారాధన శ్రేయస్సు కలిగిస్తోంది.
కర్కాటక రాశి:- తల్లి దండ్రుల అనారోగ్యం అశాంతిని కలిగిస్తుంది. ఆకస్మిక ధనవ్యయం కలుగవచ్చును. భూ, గృహలాభాములు కొంత ఆలస్యం కావచ్చు. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. నూతన వ్యాపార ఆరంభ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని ఆటంకములు కలిగిన.. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన బాధ్యతల నిర్వహిస్తారు.
సింహ రాశి:- కోపం వలన కార్యవిఘ్నాలు కలుగుతాయి. ప్రయాణం వల్ల అసౌకర్యం కలుగుతాయి. దూర్వార్త శ్రవణం కలుగనుంది. శతృత్వము పెరుగుతుంది. శరీరంలో వేడి ఎక్కువ కావడం వల్ల బలహీనత కలుగవచ్చును. సహచరులపై ద్వేషము పెంచుకోకండి. తొందరపాటు పనికిరాదు. విష్ణు ఆరాధన శుభమును కలిగిస్తుంది.
కన్యా రాశి:- చిక్కులు క్రమంగా తొలగిపోతాయి. విద్యార్థులు సద్గోష్టిలో పాల్గొనడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. శుభకార్యముల కోసం ప్రయాణాలు ఉంటాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో శుభకార్యాలకు సంబంధించి ఆలోచనలు వస్తాయి. రాదు అనుకున్న ధనం చేతికి అందుతుంది. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. లలితాదేవి ఆరాధన మరింత శుభము కలిగిస్తోంది.
తులా రాశి:- ఔషధ సేవనం చేయవలసి రావచ్చు. ఆకారణ కలహం బాధించనుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకొని ఇబ్బందులు వల్ల మనఃక్లేశానికి గురవుతారు. కుంటుంబ సభ్యులపై అపవాది బాధ కలిగిస్తోంది. ఋణ మూలక అశాంతి కలుగుతుంది. శతృ బాధలు ఉంటాయి. శివరాధన కొంత ఉపశమనం కలిగిస్తుంది.
వృశ్చిక రాశి:- సాహసముతో పనులు పూర్తి అవుతాయి. పెద్దల ఆదరణ ఇబ్బందులను దూరం చేస్తుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు ఉంటాయి. నూతన పరిచయాలు కలుగుతాయి. ప్రయాణాల్లో ఆటంకాలు ఎక్కువ అవుతాయి. వాహన ప్రమాదం కలుగవచ్చు. తొందరపాటు పనికి రాదు. సుబ్రహ్మణ్య ఆరాధన మనోస్ధైర్యం ఇస్తుంది.
ధనుస్సు రాశి: – ప్రముఖులతో పరిచయం సంతోషం కలిగిస్తోంది. దూరప్రాంతాలు నుంచి శుభ సమాచారం లభిస్తుంది. బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది. పరోపకారముతో గౌరవాన్ని పొందుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పరపతి పొందుతారు. శరీరం ఉల్లాసంగా ఉంటుంది. దుర్గా ఆరాధన మరింత శుభం కలిగిస్తుంది.
మకర రాశి:- మోసగాళ్ళ బారిన పడకుండా జాగ్రత్త వహించండి. అతి కోపము అనర్థాలకు దారితీస్తుంది. వృత్తిలో చిక్కులు కలుగుతాయి. బంధుమిత్ర వియోగము కలుగవచ్చును. ఆకారణంగా కలహం బాధించనుంది. ఆకస్మిక ప్రమాదాలు కలుగవచ్చును. మోకాళ్ళనొప్పులు, కడుపునొప్పి ఉండవచ్చు. లక్ష్మీ నారాయణ ఆరాధన మనశ్శాంతి కలిగిస్తుంది.
కుంభ రాశి:- శత్రువులు పెరుగుతారు. సోదరులతో, అభిప్రాయ భేదాలు రావచ్చు. శరీర బలహీనతలు ఉంటాయి. ఎముకలు, నరాలకు సంబంధించిన ఇబ్బందులు కలుగవచ్చును. ప్రయత్న కార్యాలలో ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. మిత్ర ద్రోహములు మనశ్శాంతి కలిగిస్తాయి. ఆకారణంగా కలహము ఏర్పడవచ్చు. గణపతి ఆరాధన చిక్కులను దూరం చేస్తుంది.
మీన రాశి:- వివాహ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. నూతన బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది. ప్రయత్న కార్యాలు నెరవేరుతాయి. ధనవ్యయము అధికంగా ఉంటుంది. అవమానాలు ఎదురవుతాయి. తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పాదములు, ఎముకల నొప్పుల బాధలు ఉంటాయి. విలువైన వస్తువులను జాగ్రత్తంగా చూసుకోవాలి. వెంకటేశ్వరస్వామి ఆరాధన మేలు చేస్తుంది.