చలికాలంలో పెరుగు తింటే జలుబుతోపాటు గొంతునొప్పి, జ్వరం వస్తాయని, గొంతులో కఫం పేరుకుపోతుందని చెబుతుంటారు. కానీ ఇవన్నీ అపోహలే అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో బ్యాక్టీరియాను ప్రోత్సహించడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చలికాలంలో తింటే జలుబు, గొంతు నొప్పి, ఫ్లూవంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే, ఫ్రిడ్జ్‌లో పెట్టిన చల్లని పెరుగును వెంటనే తినవద్దు.