జామ చెట్టు ఆకుల నుంచి టీ పెట్టుకోవచ్చని చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఆ ఆకుల టీ ఆరోగ్యానికి ఏంటో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సీ, లికోపెన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ చర్మాన్ని సంరక్షిస్తాయి. ఈ ఆకుల్లో పొటాషియం ఉండటంతో బీపీ లెవల్స్‌ను స్థిరంగా ఉంచుతుంది. శరీరంలో పేరుకుపోయి ఉన్న చెడు కొవ్వును తగ్గించి గుండె జబ్బులు, ఇతర సమస్యలు రాకుండా కాపాడుతుంది.