చలికాలంలో చర్మం పొడిబారటం, జలుబు, దగ్గుతో పాటు బరువు పెరగటం సాధారణ విషయమని ఓ అధ్యయనంలో వెల్లడైంది. చలికి వ్యాయామం చేసేందుకు బద్దకించటం ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పులు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. శీతాకాలంలో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. డిన్నర్ తర్వాత మెలకువగా ఉండేవాళ్లు మళ్లీ ఏదో ఒకటి తింటుంటారు. అలా కాకుండా పండ్లు, నట్స్ తీసుకుంటూ.. తగినంత నీటిని తాగితే బరువు అదుపులో ఉంటుంది.