‘పుష్ప-2’ మూవీ ఓటీటీ రిలీజ్ విషయంలో రూమర్స్ వస్తోన్న విషయం తెలిసిందే. అలాంటి వార్తలపై మైత్రి మూవీ మేకర్స్ తాజాగా స్పందించింది. సినిమా ఓటీటీ రిలీజ్పై వస్తున్న కథనాలు అవాస్తమమని కొట్టిపారేసింది. థియేటర్లో విడుదలైన 56 రోజుల వరకు ఏ ఓటీటీలోనూ విడుదల చేయడం లేదని.. ఆ తర్వాతే ఓటీటీలోకి వస్తుందని స్పష్టం చేసింది.